గెంతే కంగారు సంగతులు;- ఎస్. మౌనిక

  హలో! హాయ్ మై డియర్ ఫ్రెండ్స్!ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ...... మరి మీరు? విష్ యు వెరీ హ్యాపీ డే🤝🤝..... ఈరోజు మీ నేస్తం ఇంకో కొత్త విషయంతో రెడీగా ఉంది. మీరు రెడీనా తెలుసుకోవడానికి..... అదేంటో తెలుసుకుందామా మరి! ముందుగా మీకో ప్రశ్న.... కంగారుల దేశం అని దేన్ని పిలుస్తుంటారు? ఎక్కడో విన్నట్లే ఉంది కదా! అదేనండి మన ఆస్ట్రేలియా.... కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాలో ఉండే కంగారు నీటి గుర్రం అంత పెద్దదిగా ఉండేది. ఈ రోజుల్లో ఉండే కంగారు పొడవు ఆరు అడుగుల వరకు ఉంటుంది. దీన్ని కాళ్లు ముందు భాగంలో పొట్టిగాను మరియు వెనుక కాళ్లు పొడవుగాను ఉంటాయి. వెనుక కాళ్లు చాలా బలంగా పొడవుగా ఉండడం వలన కంగారు 10నుండి 15 అడుగుల దూరం చాలా సులభంగా దూకగలదు. కంగారు తోక నాలుగు అడుగుల కంటే ఎక్కువ పొడుగ్గా ఉంటుందట. వేటగాడు గాని లేకపోతే వేటకుక్క గాని తరుముకుంటూ వస్తే కంగారు పెద్దపెద్ద గంతులు వేస్తూ వేగంగా పారిపోతుంది. 25 నుండి 30 అడుగుల దూరాన్ని ఒక గెంతులో దాటగలదు. కొంచెం కొత్తగా ఉంది కదూ ఫ్రెండ్స్! ఇలాంటి ఎన్నో కొత్త విషయాలు మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా?మీ నేస్తము  ఎల్లప్పుడూ రెడీ గానే ఉంటుంది. మనం మళ్లీ త్వరలో ఇంకా కొత్త విషయంతో కలుద్దామా ఫ్రెండ్స్! బాయ్ ఫ్రెండ్స్!👋👋
కామెంట్‌లు