అమ్మ అన్ని పనుల్లో సాయం చేస్తున్న పనిపిల్లకి కాస్త ఎక్కువగా స్వీట్ పులిహోర పెట్టి ఇద్దరు పిల్లలకి కొంచెం తక్కువే పెట్టింది."మీరు ముందు కొద్దిగా తిని రుచి చూసి నచ్చితే ఇంకాస్త పెడతా ను.రోజు బడిలో లంచ్ టైం లో కొంచెం చెత్త కుండీలో పడేస్తారు అని ఆయా చెప్పింది.అందుకే లంచ్ బాక్స్ లో మీకు ఇష్టమైనది మీరే కల్పి పెట్టుకోండి. పెరుగన్నం బెస్ట్." పిల్లలకి కాస్త కోపం వచ్చింది. ఆయా తమ ఇంట్లో పనిచేసే పిల్లతల్లి.టెన్త్ పాసైన ఆపిల్ల శివా తల్లి దగ్గర మిషన్ నేర్చుకోడానికి వస్తుంది. అలా ఇంట్లో మిషన్ కుడుతూ చిన్న చిన్న సంచులు కుట్టి ప్లాస్టిక్ కవర్ల బదులు ఇవి ఐదు రూపాయలకు అమ్ముతుంది.
అమ్మ శివా జయతో అదే చెప్పింది " మీరు కష్టపడి పైకి ఎదగాలి. పని వస్తువు విలువ తెలియాలి. నేను న్యాయం గా అందరినీ చూస్తూ ప్రోత్సహించడం నావిధి ధర్మం. ఆపిల్ల ట్యూషన్లు చెప్తోంది తెలుసా? గవర్నమెంట్ కాలేజీలో చేర్పించాను.కష్టేఫలీ !
" ఆవారాగా ఉండరాదు." అంతే పిల్లలు కిమ్మనకుండా గబగబా తమకు నచ్చిన వంటకాలు బాక్స్ లో సర్దుకొని రెడీ ఐనారు🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి