అక్షరాలు ఎన్నో రుచులను ఎరుకపరుస్తాయి. అయినా, ఆ అక్షరాల్లో ఏమీలేదు సుమా!
ఆ అక్షరాలు పదాలలోకి మారి ఆ పదాలకు అర్థం పులుముకుంటేనే వాటి భావం మనకు బోధపడుతుంది. అవి మనకు ఆహ్లాదం కలిగించినా, ఆనందింపజేసినా, ఆవేశం కలిగించినా, ఆలోచన ఉద్దీపింపజేసినా, సంతోషాన్నిచ్చినా, దుఃఖాన్ని నింపినా, మనలో సహనాన్ని కలిగించినా, తిక్క రేపినా ఆ బాధ్యత పూర్తిగా మనదే సుమా! నా అక్షరాలను ఎందులో అద్దుకున్నానో చెప్పుకో! అవి లక్షల మెదళ్లను కదిలిస్తూనే ఉన్నాయి. అవి విజ్ఞాన గవాక్షాలై విశ్వపు వినువీధి రహస్యాల అంతు చూస్తూనే ఉన్నాయి. అవి నిజాలను గాలికొదిలి ఇజాలను పట్టుకువేళ్ళాడే గబ్బిలాయిలను తరిమి కొడుతూనే ఉన్నాయి. అక్షరాలను ఎందులో అద్దుకుంటావో నీ ఇష్టం మిత్రమా! కానీ, వాటికి నిరీక్షణేలేక వాడి వేడి కిరణాలవ్వాలి. వాటికి పరీక్షలేలేక అస్రాలయి అజ్ఞానాన్ని తరమాలి !!!
+++++++++++++++++++++++++
అస్త్రాలు (చిట్టి వ్యాసం);- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి