తోడుకోసం;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
తోడుకోసం
చూస్తున్నా
చుట్టుపక్కల
శోధిస్తున్నా

తోడుకోసం
తయారవుతున్నా
ఆకర్షించాలని
ఆతృతపడుతున్నా

తోడుకోసం
అదుగుతున్నా
అంగీకరిస్తే
అందలమెక్కిస్తానంటున్నా

తోడుకోసం
అభ్యర్ధిస్తున్నా
తలనూపితే
స్వర్గంచూపిస్తానంటున్నా 

తోడుకోసం
వెదుకుతున్నా
చిక్కితే
చేరువవ్వాలనుకుంటున్నా

తోడుకోసం
ప్రయత్నిస్తున్నా
పాటుపడుతున్నా
ఫలిస్తుందనినమ్ముతున్నా

తోడుకోసం
తిరుగుతున్నా
తిలోత్తమ
తగలకపోతుందాయనుకుంటున్నా

తోడుకోసం
పిలుస్తున్నా
చెంతకొస్తే
చెలిమిచేయాలనుకుంటున్నా

తోడుకోసం
వలవేస్తున్నా
తగిలితే
పట్టేయాలనిచూస్తున్నా

తోడుకోసం
తోందరపడుతున్నా
తలవంచితే
తాళికట్టాలనుకుంటున్నా

తోడుకోసం
తపిస్తున్నా
తదేకంగా
దృష్టిసారిస్తున్నా

తోడుకోసం
కలలుకంటున్నా
నిజమవ్వాలని
నిరీక్షిస్తున్నా

తోడుకోసం
తంటాలుపడుతున్నా
తిప్పలెప్పుడు
తప్పుతాయోననిచూస్తున్నా

తోడుకోసం
మొక్కుతున్నా
దొరికితే
తలనీలాలిస్తానంటున్నా

తోడుకోసం
విలపిస్తున్నా
వయసుముదురుతుందేమోనని
విచారిస్తున్నా

ఒకప్పుడు
మొలతాడుంటేచాలు
మీసం
మెలవేయటానికి
వివాహం
చేసుకోవటానికి

ఇప్పుడు
మొనగాడయినా
వరుసలో
నిలువాలిసిందే
పోటీలో
పాల్గొనవలసిందే

పాపం
మగవాళ్ళు
బెండకాయల్లా
ముదిరిపోతున్నారు
వయసుమీదపడి
వ్యధపడుతున్నారు


కామెంట్‌లు
Babu శుభాకర్ చెప్పారు…
తోడు కోసమే... చాలా చక్కగా వివరించారు