దక్షిణ కెన్యాలో ఉన్న అంబోసెలి మృగయారణ్యం ఆఫ్రికాలోని అతి ప్రాచీన పార్కులలో ఒకటి. దానిలో ఉండే ఏనుగుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన ప్రత్యేక గుర్తింపు పొందింది.
194 8 సంవత్సరంలో 2000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడిన అంబోసెలీ నేషనల్ పార్కును 1961 వ సంవత్సరంలో ఆ ప్రాంతంలో నివాసం ఉండే ముసాయి తెగ వారికి అప్పజెప్పడం జరిగింది.
సముద్ర మట్టానికి 4500 నుంచి 6000 అడుగులు వరకు ఎత్తులో కిలిమంజారో పర్వతం నేపథ్యంలో కనిపిస్తూ ఉంటే'అవెండి'పర్వతం క్రింది భాగంలో విస్తరించి ఉన్న అబోసెలీ నేషనల్ పార్క్ ప్రస్తుతం ఉన్న అతి గొప్ప సహజ జంతు సంతతలను రక్షిస్తున్నది. అంబోసెలీ పార్కు ఏనుగుల్ని కాకుండా అనేక రకాల అటవీ జంతు జాతులను కూడా సంరక్షిస్తుంది. ఖడ్గమృగాలు, ముసాయి జిరాఫీలు కణుజులు జీబ్రాలు, దుమ్ము ల గోండు, గుంట నక్కలు, చిరుతపులులు, పులులు గ్రాంట్ మరియు దుప్పులు కూడా పార్కులోని పచ్చిక మైదానాలలో కనిపిస్తాయి. కెన్యాలో అరుదుగా కనిపించే కొన్ని రకాల జాతులు పెలికాన్ లు బాతులు వంటివి గుంపులు గుంపులుగా నీళ్లు ఉన్నచోట చేరుతూ ఉంటాయి. రాబందులు గోధుమ రంగు రెక్కల గోషాక్ లు అనే గద్ద జాతి పక్షులు ఈ పార్కులో వేటాడే పక్షులుగా చెప్పవచ్చు.
1974 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. దీని వైశాల్యం 250 చదరపు మైళ్ళు.
ముసాయి తెగ ప్రజలు సంచార పశుపాలక జాతి ప్రజలు వీరు దక్షిణ కెన్యా ఉత్తర టాంజానియాలోని విశాలమైన మైదానాల్లో జీవిస్తూ ఉంటారు. దాదాపు పది లక్షల మంది ఉంటారు.
అంబోసెలీ జాతీయ పార్కు (కెన్యా);- తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి