ఉత్తర భారత దేశంలోనే ఆగ్రానగరంలో ఉన్న తాజ్ మహల్ ను పాలరాతితో మలచిన ఒక అద్భుతమైన సమాధి చిహ్నం. దీన్ని మొగలు చక్రవర్తి షాజహాన్ తనకు ప్రాణప్రదమైన భార్య ముంతాజ్ పట్ల ఉన్న అపారమైన ప్రేమకు గుర్తుగా ఆమె మరణానంతరం క్రీస్తు శకం 1631-1648 సంవత్సరాల మధ్య కాలంలో నిర్మించాడు. దీనికోసం ప్రత్యేకంగా వెయ్యి ఏనుగులు ఉపయోగించబడ్డాయని అంటారు. 22 గుమ్మటాలు అమర్చబడిన, ఒక మనసు దోచే ప్రధాన ద్వారంలో నుంచి లోపలికి అడుగుపెట్టగానే భూతల స్వర్గంలోకి అడుగుపెట్టిన ఒక అందమైన భావన కలుగుతుంది.20వేలమంది, శ్రామికులు, కళాకారులు దీని నిర్మాణానికి తమ జీవితాన్ని ధారపోశారని చెప్పవచ్చు. దీని అతి పెద్ద గుమ్మటం 200 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనికి నాలుగు మూలల్లో దీనికి 150 అడుగుల ఎత్తున నాలుగు మినారెట్లు అంటే గోపురాలు నిర్మించబడ్డాయి నిర్మించబడ్డాయి. తీవ్ర భూకంపం సంభవించి నాలుగు మీనా రెట్లు కూలిపోయినా అవి ప్రధాన భవనం మీద పడకుండా ఆనాటి స్తపతులు తగినంత దూరాన్ని ఉంచారు. తాజ్ మహల్ భూమిలోకి కుంగిపోకుండా అది నిర్మించబడిన ప్రాంతం లోని భూగర్భ జలాలను నియంత్రించడానికి ఎంతో చాకచక్రమైనా ఏర్పాటును కూడా ఆనాటి నిర్మాణ స్థపతులు చేయగలిగారు.
మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్లు ప్రపంచపు చెక్కిలి మీద తాజ్మహల్ ఒక కన్నీటి బిందువు లాంటిది.
తాజ్ మహల్.-తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి