వ్యవసాయంతో..;- కోరాడ నరసింహా రావు,... !

 నాగరికత మొదలై.... మనిషి, అంతరిక్షమంత ఎత్తుకు ఎదిగిపోయినా.... నెలతల్లినే నమ్ముకున్న  రైతన్న... తను ఉన్నచోటును వీడి అడుగు ముందుకు వేయలేదు... !
    ఎదిగినంతనే కన్నతల్లిని, ఉన్నవూరును వీడి పోయే ఈ నాటి బిడ్డగా కాక... పంచిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతగా తల్లి పాదాలను పూజచేస్తూ ఆ తల్లిని వీడని నిజ తనయులు  మన కర్షక సోదరులు !
      సాటిమనిషి కడుపు నింపటంకోసం, తమ కడుపులు కాలుతున్నా లెక్కచేయక... అన్నివిధాలా నష్టపోతున్నా... నమ్ముకున్న వ్యవసాయాన్ని వీడక బ్రతికే నీ బ్రతుకే ధన్యమయా.... !!!
 నీకివే మా వందనములు అందు కొనుమయా.... !
       ******

కామెంట్‌లు