న్యాయాలు -196
మాషరాశి ప్రవిష్ట మషీ న్యాయము
******
మాష అంటే మినుములు, బంగారము తూనికకు ఉపయోగించు కొలత, మూర్ఖుడు అనే అర్థాలు ఉన్నాయి..మాషరాశి అంటే మినుముల రాశి. మషి అంటే సిరా,మసి అనే అర్థాలున్నాయి.ప్రవిష్ట అంటే వెడలిన వాడు,ప్రవేశించిన వాడు, ప్రారంభించబడినది అనే అర్థాలు ఉన్నాయి.
మినుముల రాశిలో కలిసిన లేదా ప్రవేశించిన మసి మాదిరిగా...మసిరంగు నలుపే , మినుముల రంగు నలుపే ఒకే మాదిరిగా ఉంటుంది.
రాశిగా పోసిన మినుములకు మసిరంగు అంటితే/ కలిపితే/ ప్రవేశిస్తే మినుములు మరింత దట్టమైన రంగులో కనబడుతుంటాయి.
మినుములకు మసి కలిపినట్లయితే లేదా కలిసినట్లయితే/ ప్రవేశించినట్లయితే మసిరంగు కనబడదు.అది మినుముల రంగులో కలిసిపోతుంది. అలాగే మినుములకు విలువ కట్టినట్లయితే , అదే విలువ వాటితో పాటు మసి కూడా పొందుతుంది అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
దీనినే మానవ జీవితానికి అన్వయించి చూసినట్లయితే ...
అదృష్టం కలిసి వస్తే మంచి వాళ్ళతో లేదా పండితులతో కలిసి ఉండే యోగం పడుతుంది.అలా కలిసి వుండటం వల్ల సామాన్యుడు కూడా వాళ్ళతో పాటు పేరు తెచ్చుకోగలుగుతాడు.
అదెలా అంటే మసి అనేది అలాగే వుంటే మసి కదా! అని దానిని దూరంగా పెడతాం. ముట్టుకోవడానికి కూడా ఇష్ట పడం.
కానీ నలుపుగా ఉన్న మినుములతో కలిసి వుండటం వల్ల ... (మినుముల రంగు నల్లగా ఉంటేనే శ్రేష్ఠమైనవిగా భావిస్తాం ) ఆ నలుపు రంగు మరింత పెరుగుతుంది. మినుముల రంగుతో మసికి కూడా శ్రేష్టత కలుగుతుంది.అంటే మసికి మినుములతో కలిసి వుండే అదృష్టం దక్కిందన్న మాట.
ఇలాంటి అర్థం వచ్చేలా భాస్కర శతక కర్త తాను రాసిన పద్యంలో ఏమన్నాడో చూద్దాం...
"ఎప్పు డదృష్టతా మహిమ యించుక పాటిలునప్పు డింపు సొం/పొప్పుచునుండుగాక యది యొప్పని పిమ్మట రూపు మాయగా/నిప్పున నంటియున్న యతి నిర్మలినాగ్ని గురు ప్రకాశముల్/దప్పిన నట్టి బొగ్గునకు దా నలుపెంతయు బుట్టు భాస్కరా!"
"అదృష్టం కలిసి వస్తే నిప్పుతో కలిసి వున్న బొగ్గు ప్రకాశించినట్లే అందచందములతో ప్రకాశిస్తాడు.అలా కలిసి వుండని అదృష్ట హీనుడు బొగ్గు వలె నల్లగానే ఉంటాడు తప్ప ప్రకాశించడు " అంటారు.
కాబట్టి సజ్జన సాంగత్యం వల్ల సామాన్యుడు కూడా ప్రకాశించగలుగుతాడనీ అలా క్రమ క్రమంగా తాను కూడా సజ్జనుడు అయ్యే అవకాశం కలుగుతుందని ఈ "మాషరాశి ప్రవిష్ట న్యాయము"ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సుమాలతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి