లఘు కవితలు ;-ఎం. వి. ఉమాదేవి

 బాల సాహిత్యం ( య వత్తు సంయుక్తాక్షర పదాలు)
======================================
1)
నిత్య సంతోషమే నిర్మలభావన
ఆధిపత్యధోరణి అసలువద్దు!
సజ్జనసాంగత్యం మేలు
నిత్యకృత్యముల నిజాయితీగ ఉండు!
2)
ఉద్యోగసద్యోగములు లేని చదువేల?
పాండవోద్యోగ విజయాలు గొప్ప నాటకం!
అధ్యక్షులవారి మాట శిరోధార్యం!
అధ్యయనంలేనిదే గెలుపుoడదు
స్వాధ్యాయ సందోహమానందకరము!
3)
ఉద్యమం సూరీడు చేగువేరా
మధ్యమావతి రాగం రమ్యం
శాక్యవంశపు రాజులు ఘనులు
చాకచక్యముండాలి సు పరిపాలనకు!
4)
వ్యాఘ్ర సంతతి తరుగుచున్నది
రక్షణ చర్యలు కార్యక్రమాలు
వనరుల లభ్యతలేని గిరిజనo
గోప్యతతో అటవీ అధికారం!
5)
ఆరోగ్యమే మహా భాగ్యం
వైరాగ్యం వృద్ధులకు సరిపోవును 
పర్జన్య గర్జనము వర్షంలో!
ఆరాధ్యవ్యక్తులు అనుసరణీయులు!
6)
పాలవెల్లువ ఆద్యుడు కురియన్
ఆర్ధిక వ్యవస్థగా మార్చిన ఘనుడు!
వ్యయప్రయాసలు తీర్దయాత్రలో!
మత్స్యయంత్ర ఛేదన అర్జున ఘనకార్యం!
7)
కూచిపూడి, భరతనాట్యం మనోహరం
కథాకళీ కేరళ నృత్యం
జీతభత్యాల కోత సామాన్యుల వెతలు!
కుడ్యచిత్రాలు పురాతన అజంతా యెల్లోరాలు!
8)
మాతృ దాస్యమును తొలిగించే గరుడుడు!
సస్యవిప్లవం రావాలి తృణధాన్యాలు పండాలి
ఇతరుల రహస్యం కాపాడాలి 
కక్ష్యలో ప్రవేశం రాకెట్ ప్రయోగం!
9)
జీవవైవిధ్యం అరణ్యవాసం
ఉపాధ్యాయ సేవలు అగణ్యం!
రాజరిక వ్యవస్థలో భ్రత్యులుందురు
తెలుగు భాష రమ్యo, దివ్యం, భవ్యం!
నవ్యమైన బాట నడుద్దాం!!
పడిశానికి మిర్యాలచారు మంచిది 
మంచిర్యాల గొప్ప పట్టణం!
............................
కామెంట్‌లు