హిందీ లో వాసుదేవ ఉపాసకులను భక్త భగత అంటారు.దాస్యభావంతో ఉపాసన చేస్తారు.భగత్ అపభ్రంశపదం.మహారాష్ట్రలో ఒకప్పుడు అంటరాని వారుగా ఉన్నవారిని భగత్ అని పిలిచేవారు.శంభోశంకరుని పూజారులుగా ఉండేవారు.కోలాం ఆదివాసీల్లో కూడా భగత్ అంటే వైష్ణవ అనే అర్థం లేదు.ఒంటిపై దేవుడు పూనినవ్యక్తిని భగత్ అంటారు.కోలాన్ తెగల బస్తీలో చిన్న గుడిసెలో ఠాణే అని పూజాపీఠంఉంటుంది.రోగాలు నయంచేస్తాడు.భవిష్యత్తు చెప్తాడు.అంతా అతన్ని మహాగౌరవిస్తారు.పూనకం తగ్గాక మామూలు గా మారుతాడు.బ్రహ్మాండం అంటే 14భువనాలసమూహం.అండాకారంలో ఉంది.ముందు జలం అందులో విత్తులు వేశాడుట భగవంతుడు.మనువు చెప్పిన ప్రకారం విత్తు కాస్తా సూర్య బింబంలాగా ప్రకాశిస్తూ గోళం వెల్వడింది.బ్రహ్మ అందులోంచి పుట్టాడు.ఆగోళం రెండుగా విడిపోయింది.పైన ఊర్ధ్వ భాగం స్వర్గాది లోకాలు అధోఖండం పృధ్వీగా మారింది.భర భండ్ అనేపదం బ్రహ్మాండంగా మారింది.
బ్రహ్మాస్త్రం ని మంత్రం ద్వారా ప్రయోగిస్తారు.దీన్ని శివుడు పరుశురామునికి ఇచ్చాడు.అర్జునుడు అశ్వత్థామ మేఘనాధునివద్ద బ్రహ్మాస్త్రాలున్నాయి.
భండ్ అంటే అశ్లీలం చెడ్డ మాటలు మాట్లాడటం.దీని ఇంకో రూపం భాండ్ .ఈభాండ్ జాతి ప్రజలు గానా బజానా హాస్య సంభాషణలు ఒకర్ని అనుకరిస్తూ నవ్విస్తారు.భాండ్ అంటే విదూషకుడు అనే అర్థం కూడా ఉంది

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి