వీడియో పోటీలలో గొల్లపల్లి సమీరా కు బహుమతి

 సర్వేజనా ఫౌండేషన్, శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో విద్యాలయమే దేవాలయం అనే అంశం మీద ఇటీవల  నిర్వహించిన వీడియో పోటీలలో తెలంగాణ ఆదర్శ పాఠశాల-బచ్చన్నపేటలో పదవ తరగతి చదువుతున్న గొల్లపల్లి సమీరా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్థాయిలో ప్రథమ బహుమతి పొందడం జరిగింది.ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ కింతలి సన్యాసిరావు గారు అమ్మాయికి నగదు బహుమతిగా 500/- రూపాయలు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కె.కృష్ణవేణి గారు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.సర్వేజన ఫౌండేషన్
వారికి మా విద్యార్థులు మరియు ఉపాధ్యాయ బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదములు.

కామెంట్‌లు