అవిగో అవిగో మబ్బులు
ఆటకు రావే సుబ్బులు
రారా రారా అబ్బులు
తేరా గులాబీ సబ్బులు
వస్తున్న వస్తున్న సైదులు
తెస్తున్న నే దాచుకున్న డబ్బులు
కొందాము కాల్చిన మొక్కజొన్న కంకులు
వానలో తడుస్తూ సందడి చేద్దాం
గువ్వల వలె ఎగిరి గంతులేద్దాం
కాగితాలతో పడవలు చేద్దాం
గృహములో మొక్కలు నాటుదాం
చక్కగా ఆకుకూరలు పెంచుదాం
ఆరోగ్యమే మహాభాగ్యమని చాటుదాం!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి