ఆ నునువెచ్చని సుఖానికి...
ఆవిరై పోయాను !
నీ పవిత్ర క్షేత్రం లో...
మబ్బునై కురిసాను... !!
నీ గర్భవాసాన. రూపుదిద్దుకున్నాను !
ఈ మాయా జగతిలో....
ఈదులాడు తున్నాను !!
స్వామీ... నిన్నువీడి....
తప్పు నేను చేసాను.. !
నీ దరికి చేరాలని...
తహ - తహ పడుతున్నాను !!
నీవు దారి జూపనిదే...
నిన్ను నేను చేరలేను.. !
తండ్రీ నను కరుణించవా...
... నీ దరికి జేర్చుకోవా... !!
ఈ జలధిని ఈదలేక...
అలసి -సొలసి పోతున్నా !
శక్తియంత సన్నగిల్లి..
చతికిల బడి కూచున్నా.. !!
తండ్రీ... నను కరుణించవా...
నీ దరి... నను జేర్చుకోవా... !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి