ద్వారాల్ని పగలగొట్టి దిశల్ని ధ్వంసం చేసి
రహదారుల్ని విరగొట్టి ఆకాశ భాగ్యాల్నీ
నక్షత్రాల రత్నరాజుల్ని కొల్లగొట్టిన
ఆకర్షణల్ని ఆవిష్కరించుటకు తాళం చెవులు కనిపెట్టిన అతన్నీ
భూమికి కట్టేసి సిలువ వేస్తున్నట్లు సమాచారం
ఆకుపచ్చని రక్తం కక్కించి గాలిని
అంతా లాగేసి సముద్రంలో విసిరేసినట్లు
రుజువులున్నవి.
మింగితే సముద్రాన్నింతటిని భూమి మింగాల్సిందే.
సూర్యుడు ఎప్పుడో తప్పుకున్నాడు
కాంతులు వెన్నెల్ని కారుస్తున్న నీలాకాశం మరో దారి కనిపెట్టింది.
అక్కడ సూర్యుని అడవిలో తిరగాడుతున్న
చీకటి వెలుగుల పులులు సింహాలు
ఆకలిగొని సింహద్వారం దగ్గర వేచి చూస్తున్నాయి.
ఇది అడవి ఆఖరి వేట కాబోలు
కాంతి మొక్కల్ని పెంచి చీకటి నీటిని పోసి
పదార్థాలు లేకుండానే పంటలను పండించిన అతడు..
శబ్దాల కోసం అన్వేషిస్తూ మాటల్ని అరుపుల్ని అనువాదం చేస్తూ చివరగా
తలల్ని కాళ్లు చేతుల్నీ మొండాన్ని
పిండాల్ని వేరువేరుగా పెంచి అతికించి గాల్లో తేలాడుతున్నా ఆడా మగాల శరీరాల్నీ సృష్టిస్తున్న స్త్రీ ఇప్పుడు అతడు.
సృష్టి కార్యాలు లేవు దృష్టికి కళ్ళు లేవు ఎగరడానికి రెక్కలు లేవు
వాటంత అవే పుట్టుకొస్తున్నవి వ్యాపిస్తున్నాయి.
నీళ్లు త్రాగే ఊగే ఉయ్యాలల్ల అంగాలకుఛ ఆకలి ఒక అద్భుతం
తూలుతున్న తలలు ఎన్నైనా మార్చేయవచ్చు
దశకంఠుడు కాడు శతకంఠుడు కూడా ఉంటాడు.
పంచభూతాలను భారత భాగవతాల్లా వల్లే వేసిన నోళ్లు
కళ్ళు మూసుకుని పిల్లల్ని కంటున్నా తల్లుల్ని
తలుచుకుంటున్న తరాల్ని అలలు పుట్టినట్లు పిల్లలు పుడుతున్నారు. తీరంలో
వరాలతో పనిలేదు ఆశీర్వాదాలతో అవసరం లేదు.
రంగుల్ని కలిపిన కిరణం
గాలిని కలిపిన గురుత్వాకర్షణ
అండాలని కలిపిన శుక్రకణం
పిండాల్ని కలిపిన బ్రహ్మాండం ఇప్పుడు అతడు.
ధ్వజస్తంభం పై ఎగరేసిన జెండా అతడు
గాలిగోపురం పై రెపరెపలాడుతున్నా గాలి అతడు.
గర్భగుడిలో నిర్భయంగా నిలబడ్డ శిల్పం అతడు.
నిరాకారుడు నిర్భయుడు ఆది అంతం లేని వాడు వాడు.
ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు
భూమిపై వెలుగు అతడు.!!!!!?
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
Sri Sri kalavedika district president.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి