గాయాల గని (చిట్టి వ్యాసం);- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 గాయాలు సమస్త ప్రాణులకు కొత్తేమీ కాదు. కాని, ఆ గాయాలవెనుక కథలే కొంగ్రొత్తవి. గాయాలనుండి తప్పించుకున్న ప్రతిసారీ ఓటమే. గాయాలే కదూ నూత్నాలోచనలకు మూలం. గాయాలైన ప్రతిసారీ ఒక కొత్తయోచన ఆరంభం. గాయాలైన ప్రతిసారీ ఒక కొత్తప్రయోగం ప్రారంభం. గాయం నిజమైన అనుభవం. గాయం నిజమైన నేస్తం. గాయం శక్తినిచ్చే ఒక ఔషధం. గాయాల గేయాల ప్రతిధ్వనులే మంగళతూర్య నాదాలు. జీవితంలో ప్రతిరోజూ యుద్ధమే. ప్రతిరోజూ ప్రతికూల వాతావరణమే. ప్రతిరోజూ గాయాలకు సంసిద్ధంగా ఉండాల్సిందే. గాయాలగనిని విజయాలగనిగా మార్చాల్సిందే. ఏకాగ్రతను సాధనచేసి నిర్లిప్తతనూ శోకాన్నీ వదిలిపెట్టి ఉక్కుకండరాలూ ఇనుపనరాలూ సముపార్జించు. నీ ఒళ్ళు గాయాలగని అయినా అందులోని సహనం, ధైర్యం, ప్రేమ, శాంతి అనే సంపదను జగానికి పంచు!!!

+++++++++++++++++++++++++


కామెంట్‌లు