జీవిత సత్యం!;- - యామిజాల జగదీశ్
మన చుట్టూ ఉన్నవారిపై 
మన ప్రవర్తన చూపే నిజమైన ప్రభావం 
మనకెప్పటికీ తెలియదు.

మన చిరునవ్వు 
ఎవరికెంత అవసరమో
మనకు తెలియదు.

మన కరుణ 
ఒకరి జీవితాన్ని 
ఎంతలా 
మలుపు తిప్పుతుందో 
మనకెప్పటికీ తెలియదు.

ఎవరికైనా 
ప్రేమతో కూడిన కౌగిలింత 
లేక 
మనసుతో మాట్లాడటం
మనసుతో వినటం 
ఎంత అవసరమో 
మనకప్పటికీ తెలియదు.

కనుక 
కరుణార్ద్ర హృదయం
కలిగుండటానికి 
ఆలోచించకూడదు.

ఎవరో ఒకరి నుంచి 
కరుణ కోసం 
నిరీక్షించకూడదు
ఎందుకంటే
పరిస్థితులు ఎలాంటి
మార్పులనైనా తీసుకురావచ్చు

అందుకే అంటున్నా
కరుణ
చిరునవ్వు
ప్రేమహృది
ఎవరికెప్పుడు
ఎలా అవసరమవుతుందో
ఎవరూ ఊహించలేరు


కామెంట్‌లు