అభూ సింబెల్(ఈజిప్టు);- తాటి కోల పద్మావతి.

 అబూ సింబెల్ దేవాలయం అశ్విన్ నగరం నుండి 175 మైళ్ళ దూరంలో ఉన్నది. రాంసేస్ ద గ్రేట్ గా ప్రసిద్ధి చెందిన రామ్సే స్ క్రీస్తుపూర్వం 13 వ శతాబ్దంలో దీన్ని నిర్మింప చేశాడు.
ఈజిప్టును పరిపాలించిన 50 సంవత్సరాల లో ఈజిప్టుకు, ఇరుగు పొరుగు దేశాలకు మధ్య శాంతి మరణం నెలకొన్నది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 20వ తారీకున ఫిబ్రవరి 20వ తారీఖున సూర్యకాంతి ఈ విగ్రహాల మీద సూటిగా పడేటట్లుగా ఈ మహా దేవాలయానికి రూపకల్పన చేయబడింది. 20వేల టన్నుల బరువు తూగే ఈ దేవాలయాన్ని 1200 భాగాలుగా విడగొట్టి అక్కడ నుంచి తొలగించి సమీపంలోనే ఎత్తయిన ప్రాంతంలో పునర్మించారు.
క్రీస్తుపూర్వం 12 20-12 24 అబూ సింబెల్ దేవాలయాల నిర్మాణం.
క్రీస్తు శకం మార్చి 22, 18 13 స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ప్రాచ్యా పండితుడు జోహోన్ లుడ్విగ్ బర్కారెట్ (1784-1817) ఈ దేవాలయాలను తిరిగి కనుగొనడం జరిగింది.
క్రీస్తు శకం 196 0-1971 అశ్విన్ డాం నిర్మాణం.
క్రీస్తు శకం 1964-1968 అబూ సింబెల్ దేవాలయాలు పునర్మించబడ్డాయి.

కామెంట్‌లు