తీరం చేరని కెరటాలు.(చిట్టి వ్యాసం);-- డా. గౌరవరాజు సతీష్ కుమార్

 ఆత్మవిశ్వాసంలేని మాతృత్వం
చెత్తకుండీలూ, మురికికాలువలూ, ముళ్ళకంపలూ తమను మరుగుపరుస్తాయని భావిస్తోంది. ఈ జనసంద్రంలో అవి తీరంచేరని కెరటాలు. కనులుతెరవని పసికందులు ఏపాపపు ఆనవాళ్ళో కదా! ఆకాశమూ, భూమీ తమ నగ్నత్వానికి సిగ్గుపడుతున్నాయి
ఆ పసిగుడ్లను ఆఛ్ఛాదించలేక. ప్రకృతి ప్రపంచమంతా ఈ ఘాతుకానికి విలపిస్తున్నా ఆ పాషాణహృదయాలు కరగవు కదా! వానకుతడిసీ, ఎండకుఎండీ, చలికివణికీ కూడా బతికి బట్టకట్టిన ఆ పసికందులే భావిపౌరులై సంఘంతో కక్షకడితే ఎలా? అడుగడుగునా ముళ్ళూ, రాళ్ళూ నిండిన మార్గంలో పయనిస్తూ అసహనం, అబద్ధం, పాపం, కోపం, మోసం తమ లక్షణాలుగా చేసుకుంటే
సత్పౌరులుగా తయారవడం ఎలా?
ఈ జనసంద్రంలో వారు తీరంచేరని కెరటాలైతే ఎలా?!!!
+++++++++++++++++++++++++
.
కామెంట్‌లు