ఓ జాషువా!;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
వినుకొండ
ప్రాంతాన
పుట్టిన
విలువైనవజ్రమా!

ఖండకావ్యాలు
మధురంగా
సృష్టించిన
కవిదిగ్గజమా!

పలుపద్యాలు
పసందుగా
కూర్చిన
పండితశేఖరా!

వెలుగులు
తెలుగుసాహిత్యాన
వెదజల్లిన
కవిపుంగవుడా!

శ్మశానపద్యాలు
అద్భుతముగా
విరచించిన
కవిరత్నమా!

సందేశము
గబ్బిలంతో
శివునికి
పంపినవాడా!

శిశువు
పద్యాలతో
సర్వులను
ఆకట్టుకున్నవాడా!

నీ నామం
నిలుచుశాశ్వతం
నీ కవిత్వం
నిత్యచైతన్యం

ఆకాశంలో
తారలా
వెలిగిపో
కలకాలం

నిలిచిపో
చిరకాలం
అందుకో
వందనం


కామెంట్‌లు