పొట్టోడమ్మా పొట్టోడు
సైకిల్ మీద వచ్చాడు
మక్కువతో పిలిచాడు
చక్కటి మాటలు చెప్పాడు !!
మోటార్ సైకిల్ ఎక్కొద్దు
పోగలు మీరు చిమ్మోద్దు
కారు లారీ మీరెక్కద్దు
దుమ్ము ధూళి లేపొద్దు !!
గాలిలో కాలుష్యం నింపొద్దు
ఆ గాలి మీరు పిలుస్తే
జబ్బులు మీకు వస్తాయి
జేబులు ఖాళీ అవుతాయి !!
ఇది పెట్రోల్ లేని బండిండీ
చక్కగా పయనం చేయండి
హాయిగా గమ్యం చేరండి !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి