స్త్రీలను అమితంగా గౌరవించిన ఛత్రపతి శివాజీ చేసిన పని ఒకటి చూద్దాం.......
శివాజీ సేనలు ఓమారు ఓ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి జరిపిన దండయాత్రలో దానిని పరిపాలించిన సుల్తానుని ఓడించాయి.
శివాజీ సైన్యం జయించిన సుల్తాన్ భార్య సుందరాంగి. ఆమె సౌందర్యం ఆ ప్రాంతంలోనే ఓ ప్రత్యేకం. కనుక శివాజీ సైన్యాధిపతి, ఇతర వీరులు తమ చక్రవర్తి మనసూ, దేహమూ సంతోషంతో పరవశించాలని అనుకున్నారు.
ఆరోజు రాత్రి నిద్రపోవడానికి వెళ్తున్న శివాజీ తన గది బయట ఓ పల్లకీని చూశాడు.
"పల్లకీలో ఎవరున్నారు?" అని తన దళపతిని అడిగాడు.
అప్పుడు దళపతి "రాజా! పల్లకీలో ఉన్నది సుల్తాన్ భార్య. ఆమె సౌందర్యరాశి. ఆమె అందానికి పరవశించని వారే లేరు. అంత ఆందం ఆమెది. కనుక ఈరోజు రాత్రి మీరు ఉల్లాసంగా గడుపుతారని ఆమెను ఇక్కడకు మీకోసం తీసుకొచ్చాం...." అన్నాడు.
అనంతరం శివాజీ పల్లకీ వద్దకు వెళ్ళాడు. పల్లకీకున్న తెర తీసి చూశాడు. అప్పటికే భయం భయంగా ఉన్న సుల్తాన్ భార్య శివాజీ వంక బిక్కుబిక్కుమని చూసింది.
శివాజీ "అమ్మా....మీరు నిజంగానే అందాలరాశి. మీ కడుపున పుట్టి ఉంటే నేనూ మంచి అందంగాడిగా పుట్టి ఉంటాను" ఆన్నాడు.
శివాజీ మాటకు అక్కడే ఉన్న దళపతి, ఇతరులు సిగ్గుతో తలవంచారు.
సుల్తాన్ భార్య శివాజీకీ రెండు చేతులూ జోడించి నమస్కరించారు.
శివాజీ తన దళపతిని కోపగించుకుని "స్త్రీలు మన రాజ్యంలో దేవతలు కాదా? ఇలాంటి కార్యం చేయడానికి మీకు మనసెలా వచ్చింది?" అని తన మాటలు కొనసాగించాడు....
"స్త్రీ పట్ల ఆశ భూమీమీది ఆశకన్నా దారుణమైనది. స్త్రీమీది ఆశ ఎన్నో సామ్రాజ్యాలనే నేలమట్ఠం చేసింది. కనుక ఇకమీదట ఇటువంటీ నీచమైన పనులు చేయకండి. ఇప్పుడు మీరు చెయ్యవలసిన పనేమిటంటే ఈమెను తీసుకుపోయి ఆమె కోరుకున్న చోట దిగపెట్టిరండి" అని శివాజీ ఆజ్ఞాపించాడు.
ఈ ప్రపంచంలోని ప్రజలు ఎక్కవ శాతం మంది రెండే రకాలు.
ఒకటి చెడ్డవారు.
రెండు అవకాశం దొరకనంతవరకు మంచివారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ గుణం మారక మంచివారుగా ఉండేవారు అత్యంత అరుదు.
కనుక మనం పరిస్థితులేవైనా మంచివారిగా మాత్రమే ఉందాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి