సుప్రభాత కవిత ; బృంద
నిష్క్రమించే చీకటికి
వెలుగు ఇచ్చే వీడ్కోలు

నిదుర రాని కనులకు
కుదురు తెచ్చే వెలుతురు

అడుగు సాగని అలుపును
చేయందించి నడిపించే చైతన్యం

ఘర్షణలో గడిపిన రాత్రికి
ధైర్యం నేర్పించే  ఆలోచన

యుధ్ధం  చేసే భావాలకు
భ్రమలు తొలగించే  ఎఱుక

గాయపడ్డ మనసుకు
మరపు పూత పూసే గమనం

కంటి నిండుగ నిండిన కలలకు
సత్యాసత్యాలు విప్పిచెప్పే 
వాస్తవం

అసలైన అభిమానాల
అంతర్యం తెలియచేసే 
అంతరంగం

పూలబాటలొద్దు కనీసం 
ముళ్ళు తొలగించుకునే తెలివినిచ్చే 
అదృష్టం 


జీవితం పై చెదిరిపోని
ఆశనూ శ్వాసనూ తెచ్చే
సూర్యోదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు