కూటికోసం చేసే కష్టంలో...ఎందరి కడుపులో... నిండే భాగ్యం !విత్తునాటి భూమాత కడుపునింపు వ్యవసాయ శ్రామికులు...,పురుడుపోసి పండిన ఆ ఫల సాయాన్ని..,అందరి కడుపులు నిండగ,అందింతురు !!ఆకలి దీర్చుటకన్నా గొప్ప పుణ్య మేమున్నదీ లోకంలో !?ఆకలిదీర్చేవారిని పస్తులు పడుకోబెట్టుట... పాపమునుమూట గట్టుటయే... నమ్మండి !వ్యవసాయం చక్కగ సాగాలంటే...,ఈ కర్షక శ్రామికులే మూలం !వీరికి పనికల్పించి, ఆర్ధికంగా ఆదుకునే చిన్నకారు,సన్నకారు రైతులను నిజాయితీగా ఆదుకునే నాధులేరీ సమాజం లో... !!******
కూటికోసం;- .. కోరాడ నరసింహా రావు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి