.. కుంభవృష్టి--నస్త్యాక్షరి;- మచ్చ అనురాధ-సిద్దిపేట
 ఒకటో పాదం 1వ అక్షరం..శ్రా  రెండో పాదం 2వ అక్షరం .. వ మూడవ పాదం 11 అక్షరం ..ణ నాలుగోపాదం 10వ అక్షరం...ము 
================================================================================
శ్రావణ మాసమున్ మొదలు జల్లుల తోడను కుంభవృష్టి తో
పావన గంగ యంతటను 
వర్షపు రూపున పొంగిపొర్లగన్
బావులు  చెర్లునేకమవ ప్రాణభయమ్ముగ లోకులెల్లరున్
బ్రోవగ రమ్ము దేవయని ముద్దుగ ప్రార్థన  జేయుచుందురే  .

కామెంట్‌లు