అర్జునుడు;- కొప్పరపు తాయారు

 అర్జునుడు పరమేశ్వరుని ఇంద్రుని మెప్పించి  అనేక వరాలు పొంది వచ్చాడు. తరువాత పాండవులందరూ హిమాలయాల మీద సంతోషంగా గడపసాగారు ఒకరోజు భీముడు ఎక్కడికో వెళ్లి ఎంతసేపటికి రాకపోతే ధర్మరాజు భయపడి వెతకడానికి బయలుదేరాడు. వెతుక్కుంటూ ఉండగా వారికి బరువైనటువంటి ఊపిరితీస్తున్న శబ్దం వినిపించింది.
         వెంటనే ధర్మరాజు వెతుక్కుంటూ వెళ్ళగా అక్కడ భీముడు పెద్ద గంభీరమైన కొండచిలువ చే బంధించి పెట్టబడి ఉండడం చూశాడు. అది చూసి ధర్మరాజు దానిని ప్రశ్నించాడు. నువ్వు దేనికోసం భీముని బంధించావు అని అడిగాడు. నేనుండే స్థలానికి ఎవరు వచ్చినా బంధిస్తా కానీ వారు నా ప్రశ్నలకు సమాధానం చెప్తే వదులుతాను లేకపోతే వారిని చంపి తినేస్తానుఅంది ఆ కొండచిలువ.
          అప్పుడు ధర్మరాజు దాని ప్రశ్నలన్నిటికీ కూడా సరైన సమాధానాలు చెప్పి బంధ విముక్తిడిని చేసాడు. తర్వాత నువ్వు ఎవరు అని అడిగాడు నేను నహుషుడుని ముని శాపం వలన ఈ రకంగా కొండ చిలువనయ్యాను అని చెప్పాడు. చెప్పి శాప విముక్తి పొందాడు.
కామెంట్‌లు