మనసుతోట లోని
మలినమంత తొలగింప
కలుపు మొక్కలేరి
కలతలు రానీక పదును దేరవలె!
సహనమెంత అవసరమో
ఓర్పు ఎంత మోతాదో
కరుణ భాగమెంతో
మదిని ముందుగానే పసిగట్టవలె!
సమయమెంత విలువో
సంయమనమెంత గొప్పో
సందర్భమునకు తగ్గ
స్పందనలతో రోజు సాగవలె!
సమస్యల పాఠాలు
కలతల తరగతులు
ఒడిదుడుకుల తట్టుకుని
ఒదిగి ఎదిగి తీరవలె!
చిత్తశుధ్ధితో చింతన చేసి
సంకల్ప బలమే అండదండగా
ఆత్మవిశ్వాసపు ఆయుధముతో
యానము సాగించి గెలవవలె!
బహుమతిగ దొరికిన
బహుచక్కని రోజును
అవకాశము దొరికెననుచు
అందుకొనవలె!
అవధిలేని ఆనందము
అంతరాయములేని అవకాశము
అనునయముగ అందించు
అపూర్వమైన అరుణోదయమునకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి