శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఫతహ్ అరబిక్ పదం నించి వచ్చింది.యుద్ధంలో లభించే విజయం.ఇంకో అర్థం లో ఏదైనా పనిని సఫలం చేయడం.ఇందులోంచే ఫతేహ్ అనే పదం వికసించింది.ఫతేహ్పూర్ సిక్రీ ఫతేపూర్ ఆనాటి బాదుషాల విజయం కి ప్రతీకలు.భరతరీ అనేది భర్తృహరి అని అర్థం.అవధీ బఘేలీ మొదలైన ప్రాంతాల్లో ఆయన జీవితంకి సంబంధించిన గాథలు జానపద గీతాలు గా ప్రసిద్దిఅసలు ఎవరు భర్తృహరి? ఉజ్జయిని రాజు చంద్ర సేన్ కొడుకు.తల్లి రూప్ దేయి.భార్య  సాందేయిసింహళ ద్వీపం రాకుమారి.భార్య అనుచిత ప్రవర్తన ద్రోహం తో భరతరీ గోరఖ్నాధ్ శిష్యుడు గా కవిగా మారాడు.శృంగార నీతి వైరాగ్య శతకాలు రాశాడు.యు.పి.లోతూర్పు ప్రాంతం లో ఇతన్ని గూర్చిన పాటలు ప్రసిద్ధి.వాక్యపదీయ రాసిన భర్తృహరి వేరే వాడు.భస్మం అంటే విభూది బూడిద.మండి బూడిద ఐతే భస్మం అంటారు.శివుడు భస్మధారి.పూర్ణాహుతిలోని భస్మం పవిత్రం.సాయిబాబా గుడిలో ధుని పవిత్రం.ఆయుర్వేదం లో రకరకాల ఓషధులు వేసి చేసిన భస్మం రోగనిరోధకం.స్వర్ణభస్మం ముత్యాలను కాల్చి లోహభస్మం.. అందుకే అవి చాలా ఖరీదు.భాయీదూజ్ కార్తీక మాసం శుక్ల ద్వితీయ లో వచ్చే పండుగ.సోదరి అన్నదమ్ముల నుదుట కుంకుమ చందనం పెట్టి పళ్లు స్వీట్స్ భోజనం పెట్టాలి.సోదరులు దీర్ఘాయువు కల్గి ఉంటాలి అని దైవం ని ప్రార్ధిస్తుంది.దీన్ని భయ్యా దూజ్ అంటారు.మరాఠీలోభావ్ వీజ్ అంటారు 🌹
కామెంట్‌లు