ప్రపంచ ప్రసిద్ధి చెందిన నవల లోని వాక్యాలు ఇవి "సంతోషాలతో నిండిన సంసారాలన్నీ ఒకే మోస్తరు ఆనందానికి ఆమడ దూరం ఉండి సుఖానికి నోచుకోని సంసారాలు ఒక్కొక్కటి ఒక్కొక్క మోస్తరు"
టాల్ స్టాయ్ ఈ మాటలు అన్నారు. అతని జీవితానికి కూడా కొంతవరకు వర్తిస్తాయి ఈ మాటలు.
లియో టాల్ స్టాయ్ పేరు చెప్పేసరికి "అన్న కెరీనా" "వార్ అండ్ పీస్"' వంటి గొప్ప రష్యన్ నవలలు మరెన్నో ప్రసిద్ధ కథలు స్మృతి పదంలో మెదులుతాయి .అంతేకాదు. గాంధీజీ అంతటి మహాత్మునికి ఆదర్శమై నిలిచిన మహనీయమూర్తి కూడా. జ్ఞాపకం వస్తాడు. ఈయన సిరి సంపదలకు ఆలవాలమైన జమీందారీ వంశంలో జన్మించినప్పటికీ చాలామంది ధనికులలా. ఐశ్వర్యపు వడిలో నిద్రపోకుండా దానిని ఒక భరించరాని విషయంగా భావించి సంపదల నుండి భోగాల నుండి దూరంగా పారిపోయేందుకు జీవితాంతం ప్రయత్నిస్తూనే వచ్చాడు. అహింసా యోగి గాంధీజీకి గురుతుల్యుడయాడు. దక్షిణాఫ్రికాలో మహాత్ముడు సత్యాగ్రహోద్యమం నిర్వహించారు. తాను స్థాపించిన ఆశ్రమానికి టాల్ స్టాయ్ ఫామ్ అని పేరు పెట్టారు. అన్నా అందులో ఆశ్చర్యం ఏమీ లేదు ప్రపంచ సాహిత్యంలోనే వారె అండ్ పీస్ అరుదుగా ఉండేట్టు, ఆయన కూడా మానవాళిలో అంతటి ఆదర్శాలు కలిగిన వారిలో టాల్ స్థాయి ఒక్కడే ఒక్కడు..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి