అద్భుతమైన, ప్రమాదకరమైన, అందమైన, ప్రత్యేకమైన, విశాలమైన, మానవ నివాసయోగ్యం కాని..... ఇలాంటి మాటలు ఎన్ని ఉపయోగించినా ద గ్రేట్ డిజార్ట్ గా ప్రసిద్ధి చెందిన వర్ణించలేము.
ప్రపంచంలోనే అతి పెద్దదైన సహారా ఎడారి అట్లాంటిక్ మహాసముద్రానికి తూర్పుగా, ఎర్ర సముద్రం సినాయ్ ద్వీపకల్పానికి పశ్చిమంగా, అట్లాస్ పర్వతాలు మధ్యధరా సముద్రానికి దక్షిణంగా, సాహెల్ నైజర్ నదీ పరివాహక ప్రాంతానికి ఉత్తరంగా ఉన్నది. దీని మైదాన ప్రాంతాలలో రాతి పర్వత శ్రేణులలో ఎన్నో యుద్ధాలు, నాటకాలు, విషాద గాధలు చోటుచేసుకున్నాయి. హాలీవుడ్ సినిమాలకు నేపథ్యంగా నిలిచింది.
తూర్పు నుంచి పశ్చిమానికి 3500 మైళ్ళు ఉత్తరం నుంచి దక్షిణానికి పదిహేను వందల మైళ్ళు విస్తరించిన సహారా ఎడారి వైశాల్యం 35 లక్షల చదరపు మైళ్ళు.
సహారా ఎడారి 11 దేశాల ను ఆశ్రయించి ఉంటుంది.
సహారా ఎడారిలోని ఇసుక తిన్నలు వయాసిస్టులను ఆవరించి ఒక వెయ్యి ఒకటి అరేబియన్ నైస్ కథల భావనలు మనసును స్పృశిస్తూ ఉంటాయి. బంగారం వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. పట్టు వస్త్రాలు, మిరియాలు, ఏనుగు దంతాలు, కోకు గింజలు, తోలు వస్తువులు కూడా ఎడారిలో ఒకచోట నుంచి ఇంకో చోటికి తీసుకు వెళుతూ ఉండేవి. 19వ శతాబ్దంలో యూరోప్లో రాజవంశీయులు ఎంతో ఇష్టపడే ఉష్ణ పక్షుల ఈకల వ్యాపారం కూడా కొనసాగింది. అరబ్బులు దీన్ని నిర్జల సముద్రం అని పిలుస్తారు.
సహారా ఎడారి (నార్త్ ఆఫ్రికా);- తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి