సుప్రభాత కవిత ; - బృంద
తోట నిండా పువ్వులు
రేకులు విచ్చే తొందరలో
బుగ్గల గులాబి రంగులు
పరిమళంతో హంగులే!

గాలిలో నిండే గంధమై
పూలలో ఉండే అందమై
తోటకొచ్చిన చైత్రంలా
కమ్ముకొచ్చిన శోభలెన్నో!

ఆపలేని ఆనందంతో
ఆగలేక తొంగిచూసి నింగి
రంగులన్నీ దోచుకుని
మబ్బుల్లో దాచేసుకుందే!

తూరుపు తీగపై రోజూ
పూసే వెలుగుపువ్వు
ఆగమనం  దర్శించి
సుమాలన్నీ నిలిచిచూస్తోందే!

వెలుతురేసిన వెల్లలో
మెరిసిపోయే వసుమతి
ఇలకు దిగిన హరివిల్లై
రంగులెన్నో వెదజల్లుతోందే!

పువ్వులన్ని నవ్వులై
కనుల నిండా వెన్నెలై
కరువుతీరా ప్రేమను
కలిమిలాగా ప్రసాదించే

కమనీయమైన వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు