మనిషి నడక సాగిస్తున్నాడు. తన నడక కొనసాగిస్తున్నాడు. అమిత వేగంతో.
అమోఘ కాఠిన్యంతో. క్రోధావేశం అధికమైనట్లుగా. నిష్ఠురతకు మించినస్థితిని చేరినట్లుగా. ఉన్మత్తస్థితిని దాటేసినట్లుగా. అతడి ఆలోచనలు భ్రాంతుల ఊయల ఊగుతున్నట్లుగా అతడి వాలకం చెబుతోంది. అతడి నేత్రాలు ఎక్కడో సుదూరంగా అనంత విస్తృతిలోకి సారించబడ్డాయి. అతడి స్వరం భీతిగొలిపేంత స్థిరంగా ఉంది. అతడు తన నడక కొనసాగిస్తున్నాడు. అమిత వేగంతో ధనార్జన అనే ఊబిలో !!!
+++++++++++++++++++++++++
నడక (చిట్టి వ్యాసం);- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి