చిత్రస్పందన.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
కందములు //

పచ్చడి మెతుకులు
తినుచున్ 
ముచ్చటగానవ్వు చుండి పొలమును దున్నున్
బచ్చని పైరుల పెంచుచు
తెచ్చును సంపదలు భువికి దేవుని వోలెన్ //

కడుబీదరికంబునతాన్
విడువక నిష్ఠను సహించి వేదనలెన్నో
పుడమికి బువ్వను పెట్టగ 
మడిదున్నుచు నుండు రైతు మహనీయుడిలన్ //


కామెంట్‌లు