విక్రమార్కుని భుజం పైనున్న శవంలోని బేతాళుడు"మహీపాలా నీగురించి నేను చాలా తెలుసుకున్నను.సకల శాస్త్రాలు, సమస్తవేదాలు చదివిన నీవు చాలాకాలంగా నాకుఉన్న సందేహాన్ని తీర్చాలి.అక్షౌహిణి అంటే ఎంత?వీటితోపాటు, సుగ్రీవుని సైన్యం ఎంత అతని సైనిక ప్రముఖులు ఎవరు.నాఈ ప్రశ్నలకు తెలిసి సమాధానం చెప్పక పోయావో తలపగిలి మరణిస్తావు.అన్నాడు." బేతాళా ముందుగా అక్షౌహిణి వివరం చెపుతాను.ఏనుగులు. 21870. ( ఈమోత్తం కూడితే పద్దెనిమిది వస్తుంది.)రథాలు. 21870. ( ఈమెత్తంకూడితే పద్దెనిమిది వస్తుంది. )అశ్వాలు. 65610. ( ఈ మొత్తం కూడితే పద్దెనిమిది వస్తుంది .)పధాతి దళాలు.109350. (ఈ మొత్తం కూడితే పద్దెనిమిది వస్తుంది . )--------------218700. ( ఈమెత్తంకూడితే పద్దెనిమిది వస్తుంది .)-----------------ఇది అక్షౌహిణి సంఖ్య. -------------సుగ్రీవుని సైన్యం వివరాలు. ఒక రథము,ఒక ఏనుగు,మూడు గుర్రాలు, ఐదుగురు సైనికులను కలిపి 'పత్తి'అంటారు.దీనికి మూడు రెట్లు కలిపితే 'సేనాముఖం'అంటారు.దీనికి మూడు రెట్లు కలిపితే దాన్ని"గుల్మము" అంటారు.దానికి మూడు రెట్లు కలిపితే'గణము'అంటారు.దానికి మూడు రెట్లు కలిపితే 'వాహిని'మూడు వాహినీలు'పృతన'మూడు ప్రతనలు కలిస్తే 'చమువు.మూడు చమువులు కలిస్తే'అనీకిని'పది అనీకినీలు కలిస్తే'ఒక అక్షౌహిణి అవుతుంది.ఎనిమిది అక్షౌహిణీలు 'ఏకము'ఎనిమిది ఏకాలు 'కోటి'ఎనిమిది కోట్లు కలిపితే 'శంఖం'ఎనిమిది శంఖాలు 'కుముదం' ఎనిమిది కుముదాలు'పద్మము' ఎనిమిది పద్మాలు'నాడి' ఎనిమిది నాడులు కలిపితే'సముద్రం' ఎనిమిది సముద్రాలు అంటే 366917189200. మంది గల సేన.దీన్ని 'వెల్లువ'అని అంటారు. సుగ్రీవుని వద్ద ఇటువంటి వెల్లువలు డెభై వరకు ఉండేవి.అంటే256842399744000 మంది అన్నమాట.వీరిలో అరవై ఏడు కోట్ల మంది సైన్యాధి పతులు ఉండేవారు.వీరందరికి 'నిలుడు'అనే వానర వీరుడు సర్వ సైన్యాధి పతిగా ఉండేవాడు.వీరుకాకుండా.శతబలి,సుషేణుడు,కేసరి,గవాక్షుడు,ధూమ్రుడు, జాంబవంతుడు,నీలుడు,గవయుడు,మైంది,ధ్వివిధ,గజుడు-గంధముఖుడు,శరభ, కుముద,ప్రమతి, క్రథనుడు, సన్నాధనుడు, ధంభుడు,క్రోధనుడు,శ్వేతుడు,సముడు,నలుడు,భుషభ,వనస,కంహుడు,వహ్ని,దుర్ముఖుడు,రంభుడు,పనసుడు,తారుడు,హనుమంతుడు, అంగదుడు,ఇంద్రజానుడు,గంధవాహానుడు,రమణ్వంతుడు,దధిముఖి వంటి వీరులు ఉన్నారు.వీరిలో సీతాదేవిని అన్వేషించడానికి , శతవలి ఉత్తరదిశకు,వనతుడు తూర్పు దిశకు, సుషేణుడు పశ్చిమదిశకు, హనుమంతుడు దక్షణ దిశకు వెళ్ళారు'అన్నాడు విక్రమార్కుడు.విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా మాయమై మరలా చెట్టుపైకి చేరాడు బేతాళుడు.పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళునికై వెనుతిరిగాడు.
సుగ్రీవుని సైన్యం.బేతాళకథ.; డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి