గిరగిర తిరిగే భూచక్రం
బిరబిర ఋతువుల పరుగులు
సంద్రంలోని తేమ భూమి పై వేడివేడి పయనం!
సముద్రపు గాలులు వేగం
సుడివడి సుళ్ళు తిరుగు
చల్ల చల్లగా మెల్ల మెల్లగా భూమాత వెన్ను నిమురు
చిరు చిరు జల్లుల మువ్వల సవ్వడి తో
పంటచేల పాపాయిలు మబ్బు పాలధారల
చుక్క చుక్కగా ఎంచక్కా చప్పరిస్తూ గుటకేయు
దంచిదంచి ఈడ్చికొట్టే వడగాల్పులు
సలసల సురసురమండే ప్రాణుల గుండెలు
వేడి నూనెలో వేగే జీవాలు
కేరళలో భూపాలరాగాలాపనతోమొదలై
ఆరభితో ఆరంభం వర్షఆగమనం
పంటచేల కడుపు నింపే పాలధారలు
చిరు చిరు తొలకరి తో పులకరింత
వర్షకన్య దాగుడుమూతలు ఆడు🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి