సమస్యాపూరణ - మచ్చ అనురాధ సిద్దిపేట
 " పొలతుక చీరనున్ గొలువ మూరెడు మాత్రమె యంతయే తగున్"
===============================================
కలియుగమందు మార్పులను కన్యలు పాటిగ నాచరించుచున్
తళతళ లాడువస్త్రములు దండిగ నెంపిక జేసితెచ్చెనే
జలమున బెట్టి తీయగను జాలిగ మారెను నొక్కసారికే
పొలతుక చీరనున్ గొలువ మూరెడు మాత్రమె యంతయే తగున్ .


కామెంట్‌లు