చిలిపి ఆలోచన;- ఎస్. మౌనిక

  హాయ్! హలో మై డియర్ ఫ్రెండ్స్!ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ.... మరి మీరు? విష్ యూ ఏ వెరీ హ్యాపీ డే  🤝.... ఈరోజు మనం సరదాగా ఒక చిన్న విషయాన్ని గురించి ఆలోచిద్దామా? మనిషి అన్నం తినకుండా ఎన్ని రోజులు ఉండగలడు? ఒక్క పూట ఉపవాసం చేస్తేనే దాదాపు నీరసం వచ్చేస్తుంది..... మరి ఎన్ని రోజులు ఉండగలడు.అన్న విషయం మీరు ఊహించగలరా? నిజం చెప్పాలంటే కొన్ని ప్రాణులు తమ శరీరంలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. కుక్క దాదాపు 20 రోజుల వరకు ఆహారం లేకుండా జీవించగలదు. మనిషికి సంబంధించినంత వరకు అతడు ఆహారాన్ని తన శరీరంలో నిల్వ చేసుకోలేడు. రక్తప్రసరణ సరిగ్గా జరగాలంటే ఆహారం కావాలి. కొంతమంది చాలా రోజుల వరకు భోజనం చేయకుండా జీవించి ఉన్నట్లు మన దగ్గర కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అవేంటో చూద్దాం రండి..... స్కాట్లాండ్కు చెందిన ఆంగ్గుస్వార్ వేరి జూన్ 1965 నుండి జూలై 1966  వరకు అంటే 382 రోజులు ఆహారం తీసుకోకుండా ఉన్నాడు. ఈ సమయంలో అతను కేవలం కాఫీ, టీ, నీళ్లు, సోడా నీళ్లు మాత్రమే తీసుకునేవాడు. ఈ విధంగానే దక్షిణ ఆఫ్రికాకు చెందిన ఒక మహిళ నీళ్లు,సోడా నీళ్లు త్రాగి 102 రోజులు జీవించి ఉండగలిగింది. ఇవి కొన్ని అసామాన్య ఉదాహరణలుగా చెప్పవచ్చు. కొత్తగా ఉంది కదా ఫ్రెండ్స్! ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది కదా! మొదటిసారి తెలుసుకున్నప్పుడు నాది కూడా అదే ఫీలింగ్!... ఓకే ఫ్రెండ్స్! ఇటువంటి ఎన్నో కొత్త విషయాలను మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మీ నేస్తం ఎల్లప్పుడూ రెడీ గానే ఉంటుంది ఫ్రెండ్స్! మనం మళ్ళీ త్వరలో కలుద్దామా? బాయ్ ఫ్రెండ్స్ !👋👋
కామెంట్‌లు