పొడుపు బాల గేయము;- ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
చక్కటి పిల్లలు రారండి
చాపలు అల్లిన ఆ తాత
చిటికలు వేసి పిలిచాడు
చీకటినంత చూపాడు

చెంతకు వచ్చి నిలిచాడు
చేతులు పైకెత్తి పెట్టాడ
చైతన్య రథం ఎక్కాడు
చక్కగా పైకి ఎగిరాడు

చొక్కా గాలిలో విసిరాడు
చోద్యమేమిటి అన్నారు
చౌడ మేఘం పైకి అతడు
చంటి పిల్లల నెత్తాడు 

వేసిన చాపను చుట్టమన్నాడు
చాప పైన నేవులుచూపుతూ
అవి లెక్కించి చెప్పుమన్నాడు
పిల్లలకు చిక్కు ప్రశ్న వేశాడు

ఆ చిక్కు ముడిని విప్పండి
ఈ గేయములో గుట్టు చెప్పండి

-----------------------------------------
ఈ గేయంలోని జవాబు
చాప అంటే  ఆకాశం
నేవులు అంటే తారలు 
ఆకాశం , తారలు 


కామెంట్‌లు