కందకు వందనం...!!----శ్రీమతి సత్య గౌరి.మోగంటి,--హైదరాబాద్.


 ఇది వానాకాలం,ఆషాఢమాస పాటు,మనకు ఆరోగ్య సమస్యలు కూడా ఎదురౌతాయి.
ఇటువంటి వాటికి సహజాహారాలలో  కంద ఒకటి.
దీని లాభాలు చాలా ఉన్నాయి. 
కందలో ఉండే పొటాషియం, ఫైబర్, సహజమైన చక్కెర మనకు చాలా తక్కువ క్యాలరీస్‌తోనే ఎక్కువ బలం లభించేలా చేస్తాయి. అంతేకాకుండా కంద క్యాన్సర్ బారిన పడకుండా కాపాడటమే కాక ప్రొస్టేట్ క్యాన్సర్ నివారణకు దివ్యమైన ఔషధంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యాన్ని క్రమబద్ధీకరిస్తుంది.ఇది గుండె సమస్యలకు చెక్ పెడుతుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. బాడీకి వేడి చేస్తే... ఇది చలవ చేస్తుంది. కంద రుచి కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఫ్రై చేసుకొని  కూరలాగా,అట్టు లాగ,పచ్చడిలాగా కూడా తినొచ్చు.
బాడీలో చెడు కొలెస్ట్రాల్ ఉంటే.కందను తింటూ ఉంటే,చెడు కొవ్వు కరిగిపోయి, ఫిట్‌గా తయారవుతాం. కారణం ఇందులోని ఫైబరే. అధిక బరువు తగ్గాలనుకునేవారు వారానికో రెండుసార్లైనా కంద వండుకుంటే మంచిదే.
ఎంతో అరుదైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కందలో ఉంటాయి. అంతేనా... బీటా కెరొటిన్, విటమిన్ బీ6, విటమిన్ సీ, ఖనిజాలు ఉంటాయి. ఇవి జుట్టు,చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.
డాక్టర్లు  కంద ముఖంపై ముడుతల్ని పోగొడుతుందని చెబుతున్నారు.ఇందులోని విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్స్... ముసలితనాన్ని అడ్డుకుంటాయి.
కందలో ఫైబర్ ఎక్కువ, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. ఇవి షుగర్ పేషెంట్లు కూడా దీన్ని తినొచ్చు. కంద... బాడీలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగనివ్వదు. అందువల్ల కందను చక్కగా తినొచ్చు.
కందను వండుకొని తినాలి. ఇందులో మెగ్నీషియం, సెలెనియం, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్... మెమరీ పవర్ పెంచుతాయి. మెదడు నరాలను చురుగ్గా చేస్తాయి.
ఇమ్యూనిటీ పవర్ పవర్ కంద తింటే పెరుగుతుంది.వైరస్‌లూ మన దరి చేరవు. కంద మంచి బ్యాక్టీరియాను అభివృద్ధి చేసి... మనల్ని యాంటీ బాడీలా మార్చేస్తుంది.
మరి మీరూ పరయత్నించండి
కామెంట్‌లు