శునకం ; .. అచ్యుతుని రాజ్యశ్రీ
గోవులను తరలిస్తారు కబేళాకు!
కుక్కలని సఫా చేయలేదా కలేజా?!?
రోడ్ పై గన్ తో మనిషి ఖతం
కరిచే కుక్కని విడవటంలో మతలబు!?

మనిషి ప్రాణం కన్నా మిన్న వీధి కుక్కలు
జంతుప్రేమికులకు!
ఒళ్ళంతా గాయాలతో ఊగే ప్రాణదీపం
ఆగర్భశోకం పట్టదా ఖుషీగా
కార్లలో తిరిగే జనాబులకు

ఇంట్లో ఖరీదైన శునకాలు
పట్టుపరుపు పై మస్తు మస్తు గా
జ్వరంతో అల్లాడే ఆకలితో అలమటించే తోటి మనిషి
వారికి చీమ దోమ!


కామెంట్‌లు