మగతలో ఉన్న జగతిని
మేలుకొలిపే కిలకిలలు
ఆనందమే పరమావధిగా
ఆకసాన ఎగిరే విహంగాలు
లేవు తరతమ బేధాలు
లేవు రంగుల తేడాలు
లేవు ఏ రకమైన భేషజాలు
రెక్కల్ని నమ్ముకున్న పక్షులు
గూడు వదిలిన గువ్వలు
నింగిని తాకే స్వేచ్ఛలు
ఎరుపుగ మారిన తూరుపు చూసి
ఎరుగని సంతోషపు ఎల్లలు
దిగులెరుగని చిన్ని ప్రాణాలు
నింగిని విహరించే ప్రాణులు
వెలుగు చూడగానే వేడుకగా
కువకువలాడుతూ ప్రయాణాలు
మనసుకు తొడుక్కునే రెక్కలు
మనకూ మొలిచే అవకాశముంటే
ఎగిరి పోయి హాయిహాయిగా
చేసేయొచ్చు గగనవిహారాలు
రెక్కల్ని నమ్ముకోమని
చుక్కలను తాకవచ్చనీ
మొక్కవోని దీక్ష బూని
దిక్కులన్నీ తిరగొచ్చనీ
ఐకమత్యమే బలమని
మనమంతా ఒకటని
అందరూ బాగుండాలనీ
అందరిలో మనమూ ఉండాలనీ
మాయామోహాలు వదిలి
ఆనందగీతాలు హాయిగా
పాడుకుంటూ...
తృప్తి సంతోషాలే చక్రాలుగా
బ్రతుకుబండి నడుపుకోమనే
సందేశమిచ్చే పక్షి సమూహానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి