పంచపది ,; - కవితా పంచ కళ్యాణి!;- డా.పివిఎల్ సుబ్బారావు,
నా పంచ పదుల సంఖ్య---

984.
ఆధునిక తెలుగు కవులలో,
       "గుర్రం " వేసే పందెము! 

సమకాలీన భావకవిత,
        దారి,మళ్ళిన వైనము!

సామాజిక ప్రయోజనం,
మార్గాన అద్భుత పయనము! 

తక్కువ కుల గుర్రానికి,
 ఛీత్కార కొరడా ఘాతము! 

"కవిత్వమే ఆయుధం",
 గుర్రానికి జన నీరాజనము,
  పివిఎల్!

985.
అమ్మానాన్న వేర్వేరు కులాలు, వివక్షతకు మూలము!

బడిలో ఉపాధ్యాయుల ,
తోటివారి నిత్య ఛీత్కారము! 

చీత్కారాన్ని ఎదిరించి,
నిలిచాడు, చేసే పోరాటము !

పండితుడు, ఉపాధ్యాయుడు, ఎన్నో రూపాల జీవనము! 

రెండు మతాల అడకత్తెర, నలిగేను జీవితము, పివిఎల్!

986.
బొమ్మలు గీయడం, పాటలు, పాడడం సృజన చిహ్నము!
 
కవిత్వ ఆసక్తి ,దీపాల, పిచ్చయ్య శాస్త్రి సావాసము! 

"జూపూడి హనుమఛ్ఛాస్త్రి తో సంస్కృతకావ్యాధ్యయనము!
 
పరుగులు తీసే కవితాశ్వం,
        ఆగని ఆ సృజనము !

రచనలు సంపుటాలుగా, 
      విశాలాంధ్ర ప్రచురణము, 
                        పివిఎల్!
987.
ఆయన గబ్బిలం
కథానాయక  క్షోభ భరితము!

ఫిరదౌసి ఆత్మహత్య చేసుకున్న కవి హృదయము !* 

బాపూజీ  స్మృత్యాంజలి, గాంధీజీ మరణ ఆవేదనము!

 "క్రీస్తు", "అయోమయము",  
      "భరతమాత","సఖి","
                   ,ప్రబోధము "!

ముప్పది ఆరు గ్రంథాల తో, తెలుగు సాహిత్యం ధన్యము,
పివిఎల్!

988.
చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి,
     తొడిగే గండ పెండేరము!

కవి "కోకిల",దిగ్గజ' ,
పెక్కు బిరుదులు ప్రధానము!

క్రీస్తు కేంద్ర సాహిత్య, అకాడమీ వారి పురస్కారము!

పద్మ విభూషణ్,,
 ఆం. వి.వి.కళా ప్రపూర్ణ,, 
        సత్కారము, పివిఎల్!
_______
.

కామెంట్‌లు