వింత ఆచారం!అచ్యుతుని రాజ్యశ్రీ

 తాత చుట్టూ చేరారు అంతా!"మీకు ఓవింత విషయం చెప్పబోతున్నాను.సాధారణంగా పెళ్లి కాగానే  ఆచారం ఏంటి?" "ఏముంది? వధువు అత్తవారింటికి వెల్తుంది." ఠక్కున జవాబు చెప్పారు. "కానీ రాజస్థాన్ లో మౌంట్ ఆబూదగ్గరున్న  జవాయి అనే పల్లెలో వింత ఆచారం ఉంది. 10కి.మీ.దూరం లో ఉన్న  కుగ్రామంలో 700ఏళ్ళ నుంచి ఓవింత ఆచారం ఏమంటే  పెళ్లి అయినాక వరుడు అక్కడే ఉండిపోతాడు.     ఒకప్పుడు ఇక్కడ ఆడపిల్లల జనాభా ఎక్కువ. పెళ్లి సమస్య గామారటంతో జీవాజీ కాన్హాజీ అనే అన్న దమ్ములు  ఆఊరి బాలికలను పెళ్లాడారు.జీవాజీ   పెళ్లి తర్వాత జవాయి అనే పల్లెలో స్థిరపడ్డాడు.కాన్హాజీ దాని కి 10మైళ్ళ దూరం లో ఉన్న  కనారీ ఢాణీలో ఉండిపోయాడు. జవాయిలో40కుటుంబాలు పొలం బండి తొలి జీవిస్తున్నాయి.జనాభా 250లోపు!   మౌంట్ ఆబు చుట్టూ 16 చిట్టిపొట్టి పల్లెలు ఉన్నాయి.  మనిషి అవసరాలు అవకాశాలను బట్టి ఆచార వ్యవహారాలు మారుతాయి. ""థాంక్స్ తాతా! కొత్త విశేషాలు చెప్పావు" అన్నారు పిల్లలు 🌷
కామెంట్‌లు