అందాల ఆకాశం- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఆకాశం
కళ్ళనుకట్టేసుంది
మనసునుదోచేస్తుంది
భ్రాంతికలిగిస్తుంది

ఆకాశం
తలనెత్తి
కనమంటుంది

ఆకాశం
రంగులు
మారుస్తుంది

ఆకాశం
నిప్పులు
క్రక్కుతుంది

ఆకాశం
కాంతులు
వెదజల్లుతుంది

ఆకాశం
గాలులు
వీస్తుంది

ఆకాశం
వానజల్లులు
చల్లుతుంది

ఆకాశం
వార్తలు
ప్రసారంచేస్తుంది

ఆకాశం
దృశ్యాలను
ప్రసారణచేస్తుంది

ఆకాశం
వెన్నెలను
కురుస్తుంది

ఆకాశం
తారకలను
తళతళలాడిస్తుంది

ఆకాశం
మెరుపులు
చూపిస్తుంది

ఆకాశం
ఉరుములు
వినిపిస్తుంది

ఆకాశం
అందాలు
కనమంటుంది

ఆకాశం
ఆనందం
పొందమంటుంది

ఆకాశం
అందరిని
ఆహ్వానిస్తుంది

ఆకాశం
ఎత్తుకు
ఎదుగుతుంది

ఆకాశం
అందుకోమని
ఆహ్వానిస్తుంది

ఆకాశం
పట్టుకోబోతే
చిక్కకున్నది

ఆకాశం
అంతరంగాలను
ఆహ్లాదపరుస్తుంది

ఆకాశం
వగలుచూపుతుంది
వయ్యారలొలుకుతుంది
వింతలుచూపిస్తుంది


కామెంట్‌లు