బట్టతలకు కారణం:- ఎస్. మౌనిక

 హలో! హాయ్ మై డియర్ ఫ్రెండ్స్! ఎలా ఉన్నారు ఏంటి? నేనైతే ఫుల్ హ్యాపీ.... మరి మీరు?  విష్ యూ ఏ వెరీ హ్యాపీ డే🤝! మన ఇంట్లో ముసలి వాళ్లకు... ప్రత్యేకించి మగవాళ్లకు బట్టతల ఉండడం మనం సాధారణంగా గమనిస్తూనే ఉంటాం కదా! బట్టతల ఎందుకు వస్తుంది?ఇది సాధారణంగా అందరి మెదడులో మెదిలే లో ప్రశ్న కదా! బట్ట తలలో కూడా రెండు రకాలు ఉన్నాయండి!.. ఒకటేమో శాశ్వతమైనది మరొకటి తాత్కాలికమైనది. శాశ్వతంగా బట్టతల రావడానికి మూడు కారణాలు ఉన్నాయి.... అవేంటో తెలుసుకుందామా మరి! అవి వారసత్వం, వయస్సు  మరియు పురుష హార్మోన్లు ( ఆండ్రోజెన్స్ ) లోపం. శాశ్వతమైన బట్టతలకు చర్మవ్యాధులు, దెబ్బలు మరియు రసాయనిక పదార్థాల వల్ల ప్రభావిత మరో ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. మరి తాత్కాలిక బట్టతల ఎలా వస్తుందబ్బా? దాన్ని కూడా తెలుసుకుందాం. విపరీతమైన జ్వరం,టైఫాయిడ్, న్యూమోనియా,ఇన్ఫ్లుయెంజా మొదలైన వాటి వల్ల రావచ్చు. బలహీనంగా ఉండటం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. మంచి ఆహారం శక్తివంతమైన మందులు తీసుకుంటే తాత్కాలికమైన బట్టలను అరికట్టవచ్చు. మనకి తెలుసు తెలియనివి తెలుసుకుంటుంటే చాలా  ఆనందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్! ఇలాంటి చాలా విషయాలు తెలుసుకుంటుంటే ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం కూడా పెరుగుతాయి. మరి ఒక పదిమందికి చెప్పవచ్చు. ఇలాంటి ఎన్నో విషయాలను మీ నేస్తం మీ ముందుకు తీసుకు వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్! ఓకే ఫ్రెండ్స్!మళ్లీ మనం త్వరలో కలుద్దామా? బాయ్ ఫ్రెండ్స్!.. 👋
కామెంట్‌లు