దేవుడు; - - యామిజాల జగదీశ్
 అనగనగా ఓ గురువు హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు ఓ అశరీరవాణి గురువుకి వినిపింంచింది. అదేంటంటే....
"నువ్వు దేవుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఇక్కడి కొచ్చావు. కానీ ఆ దేవుడు నీ ఆశ్రమంలోని ఓ శిష్యుడిలో ఉన్నాడు" అన్నదే ఆ మాట.
వెంటనే ఆ గురువు ధ్యానం వీడి హిమాలయాల నుంచి తన ఆశ్రమానికి వచ్చాడు.
అప్పటి వరకూ సందడి చేస్తున్న శిష్యులందరూ మౌనంగా తమ గురువుగారికి నమస్కరించారు.
అప్పుడు గురువుగారు అశరీరవాణి మాటలుచెప్పి మీలో దేవుడ్ని చూసుకోవడినికి వచ్చానని చెప్పారు.
ఆ మాటతో శిష్యులందరూ తమలో ఎవరిలో దేవుడున్నాడో కదాని ప్రశ్నార్థకంగా చూసుకున్నారు.
ఇదొక జెన్ కథ.
నిజానికి దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా కనిపించొచ్చు. మనం చూడగలగాలంతే.
బస్సులో చండిబిడ్డనెత్తుకుని నిలబడ్డ మహిళను కూర్చోమని చెప్పి అప్పటివరకూ సీటులో కూర్చున్నతను లేచి నిలబడిన వ్యక్తిలో దేవుడుండొచ్చు.
నడవలేక నడవలేక నడుస్తున్న వ్యక్తి దగ్గర బండి ఆపి ఎక్కండి ...మిమ్మల్ని మీరనుకున్న చోట దిగబెడతానన్న వ్యక్తిలో దేవుడుండొచ్చు. 
కష్టంలో ఉన్న ఓ వ్యక్తిని గుర్తించి అతను అడక్కుండానే సాయం చేయడానికి ముందుకొచ్చిన వ్యక్తిలో దేవుడుండొచ్చు. 
కనుక దేవూడు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ రూపంలోనైనా రావచ్చు. 

కామెంట్‌లు