హవా మహల్. ఇండియా.- తాటి కోల పద్మావతి

 హవా మహల్ గా పిలువబడే ఈ అపురూప నిర్మాణం వాయు ప్రసాదంగా ప్రసిద్ధి చెందిన భవనం.
ప్రాంతం: ఆనాటి రాజస్థాన్ రాజధాని నగరమైన జయపూర్ మధ్య భాగంలో ఉంది.
నిర్మాణం: క్రీస్తుశకం 17 99 వ సంవత్సరంలో జయపూర్ మహారాజు ప్రతాప్ 2 తన జ్యోతిష్కుడు, నిర్మాణ శిల్పి అయిన లాద్ చంద్ ఉస్తా చేసిన రూపకల్పన మేరకు హవా మహల్ నిర్మాణాన్ని చేపట్టాడు.
నిర్మాణం ఉద్దేశం, ఉపయోగం: హవా మహల్ రాజప్రసాదంలో నెలకొని ఉండే రాణివాసంలో భాగంగా, అనుబంధంగా నిర్మించబడింది. మహారాజు స్వయంగా జరిపే ఉత్సవాల్ని, పరాయి పురుషుల కంటపడకుండా తిలకించడం కోసం దీని నిర్మాణం జరిగింది.
చిన్న చిన్న కిటికీలు కలిగిన ఈ భవనంలోనే గదులు తేనె పట్టు లోనే అరాలను తలపింప చేస్తాయి. రాణి వాస స్త్రీలు వాటి వెనక కూర్చుని, ఎవరికి కనిపించకుండా తమ నగరంలో రంగ రంగ వైభవంగా జరిగే ఉత్సవాలను, పండుగలను, తమ మహారాజు పూర్తి లాంచనాలతో నగరంలో సాగిపోవటాన్ని తిలకించడం కోసం హవా మహల్ నిర్మాణం జరిగింది. జయపూర్ మహారాజుల రాణివాసములో ఈరోజు కోతులు మాత్రమే గుంపులు గుంపులుగా కనిపిస్తాయి. హవా మహల్ ఐదంతస్తులు కలిగి 950 కిటికీలు, అరలతో ఉంటుంది.
ఢిల్లీకి నైరుతి దిశలో 185 మైళ్ల దూరంలో ఉన్న జైపూర్ నగరంలో ఉన్న వాయు ప్రసాదం గా ప్రసిద్ధి చెందిన హవా మహల్ కు జైపూర్ కి గుర్తింపు చేసినంగా చెప్పవచ్చు. ఇప్పుడు దీని ముందు భాగపు కట్టడం మాత్రమే నిలిచి ఉన్న, భారత ఉపఖండంలో ఎక్కువగా ఫోటోలు తీయబడేది'హవా మహలే'.

కామెంట్‌లు