మాల్దీవులు.;- తాటి కోల పద్మావతి

 సౌర కాంతి లోని దీవులుగా రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ గా పిలువబడే 1000 చిన్న ద్వీపాలు, 20 పగడపు వృత్తాకార దీవులతో కూడిన ఈ దేశం వర్ణనకు తగ్గట్లుగానే ఉంటుంది. భారత ఉపఖండ దక్షిణపు అంచుకు పశ్చిమంగా 250 మైళ్ళ దూరంలో శ్రీలంకకు నైరుతిగా 400 మైళ్ళ దూరంలో హిందూ మహాసముద్రానికి దాదాపు మధ్యలో ఈ దేశం ఉంటుంది. ఈ దేశంలోనే 20 పెద్ద పగడ పు వృత్తాలు ఉత్తరం నుంచి దక్షిణానికి 500 మైళ్ళ మేర ముత్యాల దండలు ముత్యాల అమరికలా ఉంటాయి. చివరి పగడపు వృత్తాలు భూమధ్యరేఖకు కొద్దిగా ఉత్తరంగా ఉంటాయి. 200 లఘువుద్వీపాలలో స్థిర నివాసాలు ఏర్పాటు అయినాయి. 87 లఘు ద్వీపాలను పూర్తిగా పర్యాటకుల కోసం కేటాయించడం జరిగింది.
అద్భుతమైన బీచులు అతివింతైన సముద్రాంతర నిక్షేపాలతో కూడిన మాల్దీవులు ప్రపంచం నలుమూలల నలుమూలల నుంచి జలాంతర్భాగా పర్యాటకులు, ఈత ఈదే వారికి సూర్యారాదకులైన వాయు పర్యాటకులకు, సరదాకు చిన్న బోట్లు నడిపే వారిని ఆకర్షిస్తుంటుంది.
.
కామెంట్‌లు