పిల్లలపరీక్షలు
ఏడాది పొడవునను యెంతయో జదివినను
నిండార పరీక్షలు నిక్కముగ వ్రాయవలె
ఒక్కొక్క శాస్త్రమున నొప్పుగా జవాబులు
సాలోచనము జేసి సరళముగ వ్రాయాలి
అందుకే చదవాలి అందుకొని పోవాలి
ప్రాథమిక శ్రేణిలో ప్రతివారు నిలవాలి
పరీక్షకు భయమేల నిరీక్షణ శుభమగును
ఫలితమ్ము కొరకైన పట్టుదలగా చదువు!!
దైవ పరీక్షలు
ఇదియేమి పరీక్షయొ ఇలవేణు గోపాల
జీవితము దుర్భరము భావియే నగమ్యము
అలనాటి ద్రౌపదిని సులభముగ గాచితివి
కావవే వరదయన కరిరాజు బ్రోచితివి
భరియించ లేనిదిది భక్తులకు పరీక్షలు
పాడిగాదయ మీకు పలుమార్లు వేడితిని
మరియాదగా మమ్ము సరియైన మార్గమున
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి