బంగారు రేటు ఎక్కువ ఎందుకు? ;- ఎస్. మౌనిక

 హాయ్! హలో మై డియర్ ఫ్రెండ్స్!.. ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ.... మరి మీరు? విష్ యు ఏ వెరీ హ్యాపీ డే!🤝.... బంగారం అంటే అందరికీ చాలా మక్కువ. ఇది మన పురాతన కాలం నుండి భూమిలో దొరికే అరుదైన లోహం. బంగారం అనేది పసుపుపచ్చ రంగులో  మెరిసే లోహం కదా! పూర్వంలో రాజులు కూడా బంగారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. మరి రోజు రోజుకు ఈ బంగారం ధర పెరగడానికి కారణం ఏంటి? అదీ మనం ఈరోజు తెలుసుకుందామా ఫ్రెండ్స్! మీరు రెడీనా? దీనికి నాలుగు కారణాలు ఉన్నాయి... మొదటిది ఇది అరుదుగా దొరకటం. రెండవది దీని ఉపయోగాన్ని బట్టి ధర పెరగటం..... మూడవది ఆ బంగారం యొక్క ధర దాని అందం పైన ఆధారపడటం..... మరేమో నాలుగవది... ప్రకృతిలో ఎన్ని మార్పులు వచ్చినా గాని బంగారం లో ఎటువంటి మార్పు రాదు.. అంటే ప్రకృతి వల్ల బంగారం ప్రభావితం కాదు. బంగారం మనకు భూమిలో విడిగాను లేకపోతే మిశ్రమ రూపంలో కూడా దొరుకుతుంది. దీన్ని మిశ్రమ రూపంలో నుండి వేరు చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని.ఇటువంటి ఎన్నో కొత్త విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఫ్రెండ్స్!ఇంకెందుకు ఆలస్యం? టచ్ లో ఉండండి మొలకతో!...ఓకేనా ఫ్రెండ్స్? మనం మళ్ళీ త్వరలో ఇంకొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దామా మరి!.. సరే ఫ్రెండ్స్ ఉండనా మరి!... బాయ్ 👋
కామెంట్‌లు