భీముడు;- కొప్పరపు తాయారు

 పాండవుల లో రెండవవాడు భీముడు ఇతడు వాయుదేవుని వరం వల్ల పుట్టినవాడు పుట్టడమే మంచి బలంతో పుట్టాడు ఇతని తల్లిదండ్రులు కుంతీ పాండురాజులు.
               పుట్టిన పది రోజులకే తల్లి చేతుల్లోంచి కింద పడితే ఎంతో భయపడిపోయింది కుంతీ .
  అతను పడిన రాయి పిండి అయిపోయింది. దానితో కుంతి తన బిడ్డ చాలా బలవంతుడని జాగ్రత్త పడింది
                  దుర్యోధనుడు   చిన్నప్పుడు భీముని చంపాలని మత్తు ఇచ్చి నీటిలో పడేస్తే అతడు నాగ లోకానికి చేరుకొని వేయి ఏనుగుల బలం  సంపాదించుకున్నాడు
       భుజ బలం లోను గదా యుద్ధంలోనూ కౌరవ పాండవులలో ఇతనికి సాటి ఎవరూ లేరు అని నిరూపించుకున్నాడు హిడింబాసురుడిని ఓడించి అతని చెల్లి అయిన హిడింబను  వివాహం చేసుకున్నాడు . వారి పుత్రుడే ఘటోత్కచుడు.
       కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధన  ,దుశ్శాసన మొదలగు నూరుమంది కౌరవులను భీమసేనుడే వధించాడు. అంతటి గొప్ప బలశాలి.
కామెంట్‌లు